అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. అలాగే బెటర్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకూ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 986 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసి ‘నో ఫోన్ జోన్లు’గా ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో చోటు చేసుకున్న మాల్ ప్రాక్టీసింగ్ తదితరాలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ రోజు (బుధవారం) జరిగిన తొలి పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 57 వేల 56 మంది అభ్యర్థులకు 45 వేల 808 మంది హాజరై రాసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానంద రెడ్డి తెలిపారు. 11 వేల 248 మంది ఆబ్సెంట్ కాగా.. 80.29 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.