Saturday, November 23, 2024

ఏపీలో కొత్తగా 18,561 కేసులు.. 109 మరణాలు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు అవుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో కరోనా కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,561 కరోనా కేసులు నమోదు కాగా.. 109 మంది మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 3152 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం జిల్లాలో 2094, విశాఖలో 2098, చిత్తూరులో 1621, గుంటూరులో 1639, పశ్చిమగోదావరి జిల్లాలో 1185 కేసులు నమోదు అయ్యాయి.  తాజా ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 9,481 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,11,554 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,33,017 మంది రికవరీ అయ్యారు. 

మరోవైపు కోవిడ్ కారణంగా అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 16 మంది చనిపోయారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 9 మంది, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాలో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement