Wednesday, November 20, 2024

కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. బన్నీ ఉత్సవం రక్తసిక్తం

కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న  బన్నీ ఉత్సవం రక్తసిక్తం అయింది. హొలగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటంతో పదుల సంఖ్యలో మందికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. 

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. గతంలో ఈ ఉత్సవాలను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా..  వంద మందికిపైగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: నాన్ స్టాప్ బాదుడు.. రూ.110కి చేరువలో పెట్రోల్ ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement