కడప జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 100 మంది మృతి చెందారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో వందలాది మంది గల్లంతు అయ్యారు. వరదలు 12 గ్రామాలను చుట్టుముట్టాయి. దీంతో వేలాదిమంది నిరాశ్రయులైయ్యారు. రంగంలోకి దిగిన నేవీ అధికారులు.. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 10 వేల మందిని కాపాడారు. కడప- తిరుపతి రహదారిపై మరో పది మంది గల్లంతైయ్యారు.
కడపలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి భయానకంగా మారింది. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయ పరీవాహక గ్రామాలను వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నదిలో 16 మంది గల్లంతయ్యారు. రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహంతో నందలూరు- రాజంపేట మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital