Monday, September 30, 2024

ఏపీలో 100 ఆదర్శ్ స్మారకాలు.. మూడు చోట్ల కనీస మౌలిక వసతులు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న 100 చారిత్రక ప్రదేశాలను ఆదర్శ్ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్. రెడ్డప్ప, చింతా అనురాధ, కురువ గోరంట్ల మాధవ్, మద్దిల గురుమూర్తి ప్రశ్నలకు ఆయనిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో తాగునీరు, సైన్ బోర్డులు, పబ్లికేషన్ కౌంటర్, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయగా, శాలిహుండం బౌద్ధ పర్యాటక స్థలం వద్ద టాయిలెట్, తాగు నీరు, సైన్ బోర్డులు, కెఫెటేరియా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అలాగే నాగార్జున కొండ వద్ద టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, కెఫెటేరియా, ర్యాంపులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కనీస సదుపాయాల కల్పన నిరంతర ప్రక్రియ అని, అందుబాటులో ఉన్న నిధులు, వనరుల ఆధారంగా వసతులను కల్పిస్తూ ఉంటామని తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement