Thursday, November 21, 2024

లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్ధ‌రణకు రూ.1.52 కోట్లు..

నందికొట్కూరు, (ప్రభ న్యూస్): కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండల కేంద్రంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం పున‌రుద్ధ‌ర‌ణ రూ.1.52కోట్లతో చేప‌డ‌తామ‌ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో శాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం జె ఈ ఓ ధర్మారెడ్డి తో మాట్లాడుతూ మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం అభివృద్ధి కి నోచుకోలేదని చెప్పారు. ఆలయం పురాతనమైనదని ఆలయ అభివృద్ధి కి టీటీడీ దేవస్థానం నుండి నిధులు మంజూరు చేయాలని సిద్దార్థ రెడ్డి కోరారు.

గ‌తంలోనూ ఈ విష‌య‌మూ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా శివరామకృష్ణ రెడ్డి విన‌తిప‌త్రం కూడా ఇచ్చినట్లు సిద్ధార్థ‌రెడ్డి వివరించారు. కాగా, ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ నిధుల నుండి రూ.1.14 కోట్లు కేటాయించామని బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ధర్మారెడ్డి తెలిపారు. అయితే గ్రామ రైతులు, పెద్దలు రూ.38 లక్షలు టీటీడీకి డిపాజిట్ ఇవ్వాలని అనంతరం రూ.1.52 కోట్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించ‌డానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ మాజీ బోర్డ్ మెంబ‌ర్ పెంచలయ్య, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మిత్రులు చంద్రన్న, అఖిల్, బాబ్లూ, నవీన్ , తర్తుర్ సర్పంచ్ నాగిరెడ్డి, మహేష్ రెడ్డి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement