ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి వేళాపాలాలేని విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోపక్క విద్యుత్ ఛార్జీలు పెంచామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్నా విద్యుత్ కోత ఎందుకు నిర్వహిస్తున్నారని అధికారులను ప్రజలు అడుగుతున్నారు. మౌనంగా ఉన్న విద్యుత్ అధికారులు సమాధానం చెప్పలేక ఎల్‌ఆర్ పెట్టారని చెబుతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందని ప్రజలు అధికారులను అడుగుతున్నా .. మాకే తెలియదని విద్యుత్ అధికారులు సమాధానం చెబుతారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే గాలి లేక .. మరోపక్క దోమలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు సాయంత్రం వేళ విద్యుత్ ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయని, వ్యాపార సమయంలో విద్యుత్ కోత నిర్వహించడంతో వ్యాపారం లేక అల్లాడి పోతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ కోత షెడ్యూల్ ప్రకటించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..