ఒంగోలు, ( ప్రభన్యూస్) : నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే 16వ నెంబర్ జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం తప్పింది. ఒంగోలు నగర సమీపంలోని త్రోవగుంట బ్రిడ్జి పై బుధవారం సాయంత్రం హై టెన్షన్ విద్యుత్ తీగలు ఒక్క సారి తెగిపడ్డాయి. అయితే అదే సమయంలో విద్యుత్ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే త్రోవగుంట వద్ద జాతీయ రహదారి నిర్మాణ సమయంలో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీంతో హై టెన్షన్ తీగలు కిందకు వేలాడుతూ ఉంటాయి. వాస్తవానికి బ్రిడ్జి పైన మరో పోల్ ఏర్పాటు చేసి తీగల ఎత్తును పెంచాల్సి ఉంది.
కానీ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గత కొంత కాలంగా తీగలు కిందకు వేలాడుతూ ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఒక్క సారిగా తీగలు తెగి రోడ్డుమీద పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా ట్రిప్ కావడంతో విద్యుత్ పోయింది. లేదంటే ఘోర ప్రమాదం సంభవించి ఉండేది. తీగలు తెగిపడిన విషయాన్ని గమనించిన అధికారులు హుటాహుటీనా అక్కడకు చేరుకొని మరమ్మతులు చేసే పనిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital