Saturday, November 23, 2024

టీచర్ గా మారిన ఎమ్మెల్యే రోజా… విద్యార్థులకు ఏం చెప్పారంటే..

పాలిటిక్స్ లో ఎప్పుడు బీజీబీజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీచర్ గా మారారు. విద్యార్థలుకు పాఠాలు బోధించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించిన ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ అరుదైన సన్నివేశానికి నిండ్ర మండలంలోని అత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికయ్యింది. చిత్తూరు జిల్లా అత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. అనంతరం ఆమె రోజా సోషల్ టీచర్‌ అవతారమెత్తారు. తొమ్మిదో తరగతి గదికి వెళ్లిన ఎమ్మెల్యే రోజా… అక్కడ విద్యార్థులకు సాంఘిక శాస్త్రం బోధించారు. ‘భూమి-మనం’అనే పాఠాన్ని చెప్పారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత, తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆమె వివరించారు. చెట్లను నరికేయడంతో పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, భవిష్యత్తు తరాలు కూడా బాగుంటాయని చెప్పారు. కాలుష్యం వల్ల ఆవులు, మేకలు చనిపోతున్నాయని అన్నారు. చెట్లను పెంచడం వల్ల ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుందని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఎంతో మందిని పొగొట్టుకోవడం చూశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి‌గా కాన్వెంట్ స్కూల్‌లో చదువుకునేలా బట్టలు, పుస్తకాలు, భోజనం ఇవ్వడం మాత్రమే కాకుండా పాఠశాలల్లో డిజిటిల్ లైబర్రీలను ఏర్పాటు చేసి విద్యార్థుల భాషాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడి పరీక్షలు రాసేలా ప్రోత్సహం ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః  ఏడేళ్లలో దళితులకు ఏం చేశారు ?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement