అమరావతి, : రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతతో రోజురోజుకీ మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక సమస్య లతో సతమతమవుతున్నాయి. ఇదే సమయం లో కోవిడ్‌తో మరణించిన వారి అంత్య క్రియలు నిర్వహిం చడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఒకవైపు అంబులెన్స్‌ల దోపిడీ, మరోవైపు శ్మశానంలో సైతం కాటి కాపరులు పెద్ద మొత్తంలో డబ్బు ఆశించ డంతో అంత్యక్రియలు కూడా సక్రమంగా నోచుకోని పరిస్థితి నెలకొంది. కొంత వరకు ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుని బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. కోవిడ్‌తో మరణించిన వారికి అంత్య క్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యుల కు రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement