Apco Discout : ఆప్కో భారీ మేళా Andhra Prabha SPL Story

Apco Discout : ఆప్కో భారీ మేళా Andhra Prabha SPL Story
60, 50, 40 శాతాల డిస్కౌంట్ అమ్మకాలు
గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో
60 శాతం డిస్కౌంట్ పై ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
50 శాతంపై విజయవాడలో అమ్మకాలు
మిగిలిన అన్ని షో రూమ్ ల్లోనూ 40 శాతం
26 నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం
రెండ్రోజుల్లోగా వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభం : మంత్రి సవిత
(ఆంధ్రప్రభ, తాడేపల్లి/అమరావతి)

రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Ap minister Sabita) తెలిపారు. 60, 50, 40 శాతాల డిస్కౌంట్ ల పై చేనేత వస్త్రాలను విక్రయించనున్నామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

తిరుమల వెంకన్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ( Tirupathi ) తిరుపతిలో చేనేత బజార్ (Chenetha Bazar) నిర్వహించనున్నామన్నారు. మరో రెండ్రోజుల్లో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయనున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చేనేత, జౌళి శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
Apco Discout :

మెగా క్లస్టర్ల ఏర్పాటు, గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 శాతం డిస్కౌంట్ (60 % Discount) అమ్మకాలపై గుంటూరులోని చేనేత ఏడీ కార్యాలయ ఆవరణలోనూ, మంగళగిరిలోని (Yerrabalem) యర్రబాలెంలో ప్రత్యేక కౌంటర్లు (Special Conter) ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

విజయవాడలోని (In Vijayawada) ఆప్కో మెగా షో రూమ్ లో (Mega Shoe room) 50 శాతం డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఆప్కో షో రూమ్ ల్లో 40 శాతంపై డిస్కౌంట్ అమ్మకాలు సంక్రాంతి (pongal) వరకూ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో డిస్కౌంట్ అమ్మకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. తెలుగువారి పెద్ద పండుగను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని, ఇంటిళ్లపాది చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు.
Apco Discout : రెండ్రోజుల్లోగా కొనుగోళ్లు షురూ

మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు ప్రారంభించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షో రూమ్ ల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న వస్త్రాలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. నిర్ణీత గడువును నిర్దేశించుకుని ఈ కొనుగోళ్లు ముగించాలన్నారు. సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను నేరుగా ఆప్కో షో రూమ్ లకు తరలించాలన్నారు.
Apco Discout : రూ.99.60 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురండి…

ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ (Handloom cluster) క్లస్టర్ కు రూ.38.31 కోట్లు, పిఠాపురం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు రూ.15.11 కోట్లు, మంగళగిరి హ్యాండ్లూమ్ పార్క్ కు రూ.22.36 కోట్లు, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.15 కోట్లు, 30 ఆప్కో షో రూమ్ ల అభివృద్ధికి రూ.8.82 కోట్లతో ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపినట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి తెలిపారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, నేషనల్ హ్యాండ్లూమ్ డవలప్ మెంట్ ప్రొగ్రాం కింద కేంద్రానికి పంపించిన రూ.99.60 కోట్ల విలువైన ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు వచ్చేలా కృషి చేయాలని అధికారులకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.

Apco Discout : 26 నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ రానున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో చేనేత ఎగ్జిబిషన్ ను ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వచ్చే నెల ఏడో తేదీ వరకూ తిరుపతిలోని డీపీఆర్ కన్వన్షెన్ హాల్లో నిర్వహించే చేనేత ఎగ్జిబిషన్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణిని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.
aLSO rEAD : Gold Target : ₹ లక్షన్నర Andhra Prabha Analysis
