AP Parishad Elections: ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు
AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎంపీటీసీ పదవులకు 18,843 మంది, జడ్పీటీసీ పదవులకు 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు
పలు జిల్లాల్లో టీడీపీ, వైపీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు భద్రతాను పర్యక్షవేక్షిస్తున్నారు. కడప, పల్నాడు లాంటి జిల్లాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మండ్లెం గ్రామ కేజీ రోడ్డుపై వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వైసీపీ ZPTC అభ్యర్థి నేహా తండ్రిని పోలీస్ స్టేషన్కి తరలించారు. టీడీపీ నాయకులు, పోలీసులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.
మరో చోట కడప జమ్మలమడుగులోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దమడియం మండలం గుండ్లకుంటలో గొడవ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి వైసీపీ నేతలు పంపించేశారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తమ్ముడి కుమారుడు శివారెడ్డి తమను బయటకు పంపాడంటున్న కూటమి ఏజెంట్లు
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి..
పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
