AP | ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం..

- వ్యాసరచన విజేతలకు బహుమతి ప్రధానం
- బహుమతి ప్రదానోత్సవం చేసిన సుజనా చౌదరి
భవానిపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు,భాషా సమానత్వానికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు అనే అంశం పై వ్వాసరచన పోటీలు నిర్వహించారు.
ఆ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం శనివారం ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారుఖ్ షుబ్లీ కార్యాలయంలో నిర్వహించారు. వివిధ జిల్లాలో ప్రతిభ కనబర్చిన విజేతలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశంశా పత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉర్దూ అకాడమీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అకాడమీ అభివృద్ధికి అవసమరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉర్దూ అకాడమీకి సంబందించిన లైబ్రరీ ఏర్పాటుకు సహకరించాలని చైర్మన్ ఫారుఖ్ షుబ్లీతో పాటు సభ్యులు ఎమ్మెల్యేను అభ్యర్ధించారు.అధికారులతో మాట్లాడి లైబ్రరీ ఏర్పాటుకు సహకరిస్తానని సుజనాహామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ ఎమ్మెల్యే సుజనాను సత్కరించారు.కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,ఉర్దూ అకాడమీ సభ్యులు,మదరసా విద్యార్థులు పాల్గొన్నారు..
