అన్నమయ్య జిల్లా లో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చేందారు.. కురబలకోట మండలంలోని కడప క్రాస్ సమీపంలోని తానామిట్ట అడవిపల్లె దగ్గర శుక్రవారం వేకువజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి రాజమండ్రికి గ్రానైట్ లోడుతో లారీ వెళ్తోంది. అయితే సత్యసాయి జిల్లా నంబలం పూలకుంటలో సోలార్ పరికరాలు అన్లోడ్ చేసి మంగళూరుకు వెళుతున్న మరో లారీ కూడా వెళ్తోంది. ఈ రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ రెండు లారీల్లోని డ్రైవర్లు ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. రెండు లారీలు నుజ్జు నుజ్జు కావడంతో అధికారులు వాటిని జేసీబీ సహాయంతో బయటకు వెలికి తీస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP | రెండు లారీలు ఢీ – ఇద్దరు దుర్మరణం ..
