కేదారేశ్వరపేట, (ఆంధ్రప్రభ): వేసవి కాలంలో అదనపు రద్దీని తగ్గించడానికి, రైల్వేలు విజయవాడ డివిజన్ నుండి వెళ్ళే వివిధ గమ్యస్థానాల మధ్య 16 వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి.
వీటిలో ట్రైన్ నెం.07325 హుబ్బలి – కతిహార్ ఈనెల 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు 4 సర్వీసులు, ట్రైన్ నెం.07326 కతిహార్ – హుబ్బలి ఈనెల 12వ తేదీ నుండి మే మూడో తేదీ వరకు 4 సర్వీసులు నడపనున్నారు.
ట్రైన్ నెం.06559 యస్ యంవీటీ బెంగళూరు – నారంగి ఈనెల ఎనిమిదో తేదీ నుండి 29వ తేదీ వరకు 4 సర్వీసులు, ట్రైన్ నెం.06560 నారంగి – యస్ యంవీటీ బెంగళూరు ఈనెల 12వ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు.