AP | డీ లిమిటేష‌న్ పై ష‌ర్మిల గ‌రం గ‌రం

విజ‌య‌వాడ : డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాద‌ని.. ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమ‌న్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల అన్నారు. చెన్నైలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ అధ్య‌క్ష‌త‌న నేడు జ‌రుగుతున్న డీలిమిటేష‌న్ స‌ద‌స్సు నేప‌థ్యంలో ఆమె ఒక లేఖ ద్వారా త‌న అభిప్రాయాల‌ను వెలిబుచ్చారు..జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేన‌ని అన్నారు.. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుంద‌ని హెచ్చ‌రించారు.. సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పద‌ని పేర్కొన్నారు ష‌ర్మిల‌.

జ‌న‌భా ప్రాతిప‌దిక‌న డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేద‌ని కేంద్రాన్ని ఆమె హెచ్చ‌రించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేద‌ని తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే… దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144 సీట్లు మాత్ర‌మేన‌ని గ‌ణాంకాల‌తో చెప్పారు.. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం ? అంటూ పేర్కొన్నారు ష‌ర్మిల‌.

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంద‌న్నారు ష‌ర్మిల‌. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత మోడీకి బుద్ధి రాద‌ని అన్నారు. ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు డిలిమిటేష‌న్ పై మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేన‌ని పేర్కొన్నారు. వారు మాట్లాడ‌క‌పోవ‌డం ప్రజల హక్కులను కాలరాసినట్లేన‌న్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్ష మద్దతు అని ఒప్పుకున్నట్లేన‌న్నారు. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు ఒక్క‌తాటిపైకి వ‌చ్చి మోదీలో పోరాడాల‌ని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *