AP | స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు రూ.50 లక్ష‌ల విరాళం

వెల‌గ‌పూడి – స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ నేడు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రూ.50 ల‌క్ష‌ల‌ చెక్ ను మంత్రికి అందజేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు విరాళం అందజేసిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులను నారా లోకేష్ అభినందించారు…

మాట నిలుపుకున్న నారా లోకేష్ ..

మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట‌ను మ‌రోసారి నిలుపుకున్నారు.. దుగ్గిరాల ఎంపిపిగా అవ‌కాశం ఇస్తాన‌ని గతంలోనే ఆ పార్టీకి చెందిన ఎంపిటిసి షెక్ జెబిన్ కు హామీ ఇచ్చారు.. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రిగిన ఎంపిపి ఎన్నిక‌ల‌లో దుగ్గిరాల ఎంపీపీ గా కూటమి అభ్యర్థి ( టిడిపి) షేక్ జెబిన్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.. దుగ్గిరాల‌లో మొత్తం 10 మంది ఎంపీటీసీల మద్దతు ఉండ‌టంతో ఈ ఎన్నిక‌కు వైసిపి దూరంగా ఉంది.. దీంతో జెబిన్ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.. ఈ సంద‌ర్బంగా గెలుపొందిన ఎంపిపి కి టిడిపి నాయకులు నందం అబద్ధయ్య , పోతినేని శ్రీనివాసరావు, కేశంనేని శ్రీ అనిత, గూడూరు వెంకట్రావు, తదితరులు అభినంద‌న‌లు తెలిపారు.

Leave a Reply