AP | 24న శ్రీశైలానికి గవర్నర్ రాక..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 24వ తేదీన నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీశైలంలో పర్యటించి భ్రమరాంబ మల్లికార్జున అమ్మవార్లను దర్శించుకోనన్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు షెడ్యూల్ ను ప్రకటించాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీశైలాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు.
ఈ నెల 24న సాయంత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి బ్రమరాంబిక గెస్ట్ హౌస్ లో బసచేసి.. 25వ తేది ఉదయం 11 గంటలకు సున్నిపెంట హెలిపాడ్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లిపోతారు.
గవర్నర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా, ఎస్పీ, దేవస్థానం ఈవోలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఆయన రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బెటాలియన్ను కూడా నియమించామని, జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన ఏర్పాట్లను ప్రత్యేకంగా చూస్తున్నారు.