Ap-Cm-Warning-Narsapuram-Mla : సీబీఎన్ సీరియస్ Andhra Prabha Top News
Ap-Cm-Warning-Narsapuram-Mla : సీబీఎన్ సీరియస్ Andhra Prabha Top News
- బొమ్మిడికి క్లాస్
- ఎమ్మెల్యే అవాక్కు
- ఎమ్మెల్యే గారు పెర్ఫార్మెన్స్ బాగోలేదు.
- మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి.
- జనం ఎదుటే సిఎం వార్నింగ్
- నర్సాపురంలో సంచలనం
(నర్సాపురం, ఆంధ్ర ప్రభ).

ఎమ్మెల్యే గారు మీ పనితీరు మెరుగు పరుచు కోవాలని
సి ఎం చంద్రబాబు నాయుడు సభా ముఖంగా అనడం తో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కంగు తిన్నారు. మంగళవారం మొగల్తూరు లో జరిగిన ప్రజా సభ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నింట్లో మైనస్ లో ఉన్నారు. 25 పాజిటివ్ పాయింట్లు ఉంటే 23మైనస్ పాయింట్లు ఉన్నాయన్నారు. జిల్లా బాగుంది…. నర్సాపురం నియోజకవర్గం పరిస్థితి బాగోలేదు. గత రెండు నెలల పెర్ఫార్మెన్స్ అధ్వాన్నంగా ఉంది . మెరుగు పరుచుకోవాలి అని చంద్రబాబు నాయుడు చెబుతుండగా ప్రజలు చప్పట్లు కేరింతలు కొట్టారు. అదిగో తాను చెబుతుంటే ప్రజలు కూడా చప్పట్లు కోరుతున్నారంటూ ఎమ్మెల్యే నాయకర్ వైపు చంద్రబాబు నాయుడు చూస్తూ అన్నారు. మీరు, మీ నోడల్ అధికారి పని తీరు మెరుగు పరుచు కోవాలని క్లాస్ తీసుకోవడం తో సభా ప్రాంగణం సైలెంట్ గా మారిపోయింది. ఇక్కడ నర్సాపురం లో అధికారుల పనితీరు 69శాతం మాత్రమే ఉందన్నారు. అధికారుల పనితీరును సభా ముఖంగా చెప్పడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రజలు కూడా చప్పట్లు కొట్టడంతో చంద్రబాబు స్పందిస్తూ ప్రజలు కూడా ఎలా చప్పట్లు కొడుతున్నారనడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని, పనితీరు మెరుగు పరుచు కావాలని హితవు పలికారు. జిల్లా యంత్రాంగం పనికూడా బాగో లేదన్నారు. నర్సాపురం నియోజకవర్గం నోడల్ అధికారి వీరభద్రరావు పనితీరు అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ నోడల్ అధికారి స్థానంలో సమర్థవంతమైన అధికారిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు.
