Ap-Cm-Common-Man : సీఎం అంటే.. కామన్ మ్యానే..! Andhra Prabha Top News
Ap-Cm-Common-Man : సీఎం అంటే.. కామన్ మ్యానే..! Andhra Prabha Top News
- పేదల కఫాలు పంచుకుంటాం
- అసెంబ్లీకి రావట్లేదు
- ప్రతిపక్షం అంటే.. అభివృద్ధికి ఆటంరకమా
- సమానంగా సంక్షేమం..అభివృద్ధి చేస్తున్నాం
- సంపద సృస్టిస్తాం
- రేపలెల్లో సీఎం సీబీఎన్
(రేపల్లె, ఆంధ్రప్రభ )
చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యాన్ అని విశ్వసిస్తున్నాను. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నాను , పేదలకు న్యాయం చేయాలన్న బాధ్యతతో మేం పనిచేస్తున్నాం., ఇక ప్రజలు కొట్టిన దెబ్బకు దెబ్బకు గొడ్డలి పార్టీ నాచకులు అలిగి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ అంటే పోటీ తత్వం ఉండాలి. కాని గొడ్డలి పార్టీకి కుట్రతత్వం ఉంది.అభివృద్ధికి ఆటంకాలు కలిగించటమే గొడ్డలి పార్టీ పని. ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
రేపల్లెలోగురువారం పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉతూ,
సీఎం అంటే కామన్ మ్యాన్
గడచిన 28 నెలలుగా ప్రతినెలా మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నాను 1వ తేదీన అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల సేవలో ఉంటున్నారు. చీఫ్ మినిస్టర్ అంటే కామన్ మ్యాన్ అని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నానుపేదలకు న్యాయం చేయాలన్న బాధ్యతతో మేం పనిచేస్తున్నాం. ప్రతి నెలా నాలుగు మార్లు ప్రజల ముందుకు వస్తున్నాం ప్రతి నెలా 1 తేదీన పేదలకు ఆర్ధిక భద్రత కల్పించే పెన్షన్ల కార్యక్రమం, 9 తేదీన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నాం
గత పాలకులు సృష్టించిన భూ వివాదాలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం ఇక ప్రతిమూడో శనివారం పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి , 4 శనివారం సంజీవని కార్యక్రమానికి హాజరవుతున్నానుప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని నిత్యం ప్రజా సేవకులుగా పనిచేస్తున్నాంగడచిన రెండేళ్లుగా ప్రతీ వ్యక్తికి, ప్రతీ కుటుంబానికి సాధికారిత తీసుకువస్తున్నాంరాష్ట్రంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది, అని సీఎం వివరించారు.
ప్రజల దెబ్బతో.. అసెంబ్లీకి రావటం లేదు
గొడ్డలి పార్టీ నేతలు ప్రజలు కొట్టిన దెబ్బకు అలిగి అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేస్తున్నారు గత పాలకులు అన్ని వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు. కష్టంతో సంకల్పంతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తు్న్నాంఆర్ధిక సవాళ్లు అధిగమించి సంక్షేమం అందిస్తున్నాం. పెన్షన్లకే ఇప్పటికి రూ.76 వేల కోట్లు ఖర్చు చేశాంవెంటిలేటర్ పై ఉన్న ఆర్దిక వ్యవస్థను కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు, బుల్లెట్ స్పీడ్ తో సుపరిపాలన అందిస్తున్నాం పేదరికాన్ని ఆర్ధిక కోణంలో కాదు మానవీయ కోణంలో ఆలోచించి జీవన ప్రమాణాలు పెంచడానికి చూస్తున్నాంసంక్షేమంతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా అట్టడుగున 20 స్థాయి మందికి చేయూత అందించేలా చర్యలు చేపట్టాం బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారి జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం, అని సీఎం స్పష్టం చేశారు.
సమానంగా సంక్షేమం.. అభివృద్ధి
రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నివాసస్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చాం రూ.52 వేల కోట్ల విలువైన నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాం పేదల కుటుంబాలకు చేయుతను ఇచ్చే అంశాన్ని ఆర్ధిక కోణంలో చూడటం లేదు. పేద కుటుంబాల్లో 3-4 పథకాల ద్వారా ఆర్ధిక సహకారం చేయూత అందుతోంది. స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం, మత్స్యకార సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో ఇలా వేర్వేరు పథకాలు అందుతున్నాయిరాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 1 లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాం. మరో 5 లక్షల మందిని కూడా వ్యాపారవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాంప్రతినెలా డబ్బులు ఇచ్చేసి వెళ్లడానికి రాలేదు. ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకోడానికి వస్తున్నానుఅట్టడుగు వ్యక్తికి ఆర్ధిక స్థోమత ఇచ్చి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే అభివృద్ధి… అదే నా సిద్ధాంతంసంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా చేపడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.11వేల కోట్లతో పనులు చేపడుతున్నాం, గత పాలనలో రోడ్లన్నీ గోతులు పడి ఉన్నాయి. రెండేళ్లుగా వాటిని పూడ్చి రోడ్లు బాగు చేశాం సంజీవని కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా పర్యవేక్షిస్తాం, అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
సంపద సృష్టిస్తాం
ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించటం ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు . రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం…వీటితో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. సంపద సృష్టించేలా క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెంచాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తున్నాంరాయలసీమ జీవనాడి హంద్రినీవా మొదటి దశ పనులు పూర్తి అయ్యాయివంద రోజుల్లో రూ.3500 కోట్ల ఖర్చు చేసి చిట్టచివరి ప్రాంతమైన కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి మార్కాపురం వరకూ నీళ్లు తీసుకువచ్చాం శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి మార్కాపురం చెన్నకేశవ స్వామి చెంతకు కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి నీళ్లు తీసుకువెళ్లాం, అని సీఎం చెప్పారు. .
అభివృద్ధికి ఆటంకమే .. గోడ్డలి పార్టీ పని
ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రాష్ట్రంలో కరవు వచ్చింది. డ్రామాలు ఆడటానికి గొడ్డలి పార్టీ బయల్దేరింది. వరుణ దేవుడి కృపవల్ల మనకు సరైన సమయంలో కాస్త వర్షాలు పడ్డాయి. కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా డెల్టాకు తెచ్చాం గతంలో కేవలం 13 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చాం పోలవరం పూర్తి అయితే కృష్ణా, గోదావరి డెల్టాలకూ నీటి సమస్యే ఉండదు. పట్టిసీమ అనే నిర్ణయం ఇక్కడి రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. గొడ్డలి పార్టీ విమర్శలకు భయపడితే కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చేవి కావు. ప్రతిపక్ష పార్టీ అంటే పోటీ తత్వం ఉండాలి. కాని గొడ్డలి పార్టీకి కుట్రతత్వం ఉంది.అభివృద్ధికి ఆటంకాలు కలిగించటమే గొడ్డలి పార్టీ పని, సీఎం చంద్రబాబు విమర్శించారు. .
