AP | ప్రజా సమస్యలపై నిరంతర దృష్టి

AP | ప్రజా సమస్యలపై నిరంతర దృష్టి
- నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
- డయల్ యువర్ కమిషనర్‌కు 27 ఫిర్యాదులు
AP | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు నిరంతరం దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వివిధ కాలనీలకు సంబంధించిన రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, మరమ్మత్తులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై 27 ఫిర్యాదులను స్వీకరించారు. వాకిటాకి ద్వారా సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను తెలుసుకుని, సమస్యల పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించినట్లు కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, డిసిపి అంజాద్ బాషా, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
