AP | వేరుశనగ, కందుల వ్యాపారం ఉత్సాహంగా.

AP | వేరుశనగ, కందుల వ్యాపారం ఉత్సాహంగా.

AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో సోమవారం జరిగిన ఈ-నామ్ (e-NAM) లావాదేవీల్లో పలు పంటల ధరలు గణనీయంగా నమోదయ్యాయి. ముఖ్యంగా మిర్చి, వాము, వేరుశనగ, కందుల ధరలు రైతులకు ఊరట కలిగించే స్థాయిలో ఉండగా, కొన్ని ధాన్య పంటల ధరలు స్థిరంగా కొనసాగాయి.

AP

వేరుశనగకు మంచి డిమాండ్…

వేరుశనగలు 167 లాట్లలో 5,903 సంచులు (1,471 క్వింటాళ్లు) మార్కెట్‌కు రాగా, కనిష్ట ధర రూ.4,656, గరిష్ట ధర రూ.9,710గా నమోదైంది. మోడల్ ధర రూ.9,600 వరకు ఉండటం గమనార్హం. వ్యాపారులు నాణ్యతకు అనుగుణంగా అధిక ధరలు చెల్లించినట్లు సమాచారం.

AP

వాముకు రికార్డు స్థాయిలో ధర…

వాము 1,055 లాట్లలో 7,561 సంచులు (3,781 క్వింటాళ్లు) భారీగా రాగా, కనిష్ట ధర రూ.2,622 కాగా గరిష్ట ధర రూ.26,140 వరకు పలికింది. మోడల్ ధర రూ.19,140గా నమోదవడం విశేషం. వాము పంటకు డిమాండ్ పెరగడంతో ధరలు ఎగసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

మిర్చి రకాలలో భారీ హెచ్చుతగ్గులు…

మిర్చి తేజా రకం 49 లాట్లలో 498 సంచులు రాగా, గరిష్ట ధర రూ.18,135గా నమోదైంది. మిర్చి తాలు రకం గరిష్టంగా రూ.18,601 వరకు విక్రయ

Leave a Reply