మూగజీవికి పునర్జన్మ..

మూగజీవికి పునర్జన్మ..
జగయ్యపేట, ఆంధ్రప్రభ : మానవత్వానికి నిదర్శనంగా జగయ్యపేటలో ఒక ఆవుకు ప్రాణదానం లభించింది. ఈనుతున్న క్రమంలో గర్భసంచి బయటకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆవును స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), సంకా వెంకట భాస్కర్ రావు,జొన్నాదుల సురేష్ ,సంకా హరీష్, పులగం సాగర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్పందించి కాపాడారు. డా. సురేష్ కుమార్, నరేష్, సతీష్ బృందం తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆవుకు అత్యవసర చికిత్స అందించారు. చల్లా గణేష్, నాగరాజు (అడ్వకేట్), కావేటి కృష్ణ, కోటి, గోపి తదితరులు రెస్క్యూలో పాల్గొన్నారు. చికిత్స అనంతరం తల్లి ఆవును, దూడను సంరక్షణ కోసం బృందావన్ గోశాల కు తరలించారు. ప్రస్తుతం ఆవు, దూడ క్షేమంగా ఉన్నాయని వైద్యులు ధృవీకరించారు. ఆపదలో ఉన్న మూగజీవి ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే ని, వారి బృందాన్ని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.

