ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం..

ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం..

ఏపీ రాష్ట్ర శ్రింప్ హ్యాచరీల సంఘం ఉపాధ్యక్షుడిగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఎన్నిక

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : విజయవాడలోని తాజ్ వివాంతా హోటల్‌లో ఘనంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రింప్ హ్యాచరీల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంఘం ఉపాధ్యక్షుడిగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు నరేంద్ర వర్మ మాట్లాడుతూ, సంఘం యొక్క భవిష్యత్తు కార్యాచరణ, దూరదృష్టిని వివరించారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు. హ్యాచరీల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, విధానపరమైన నిర్ణయాల్లో హ్యాచరీల తరపున బలమైన గళాన్ని వినిపించడంలో నరేంద్ర వర్మ కీలక పాత్ర పోషించనున్నారు.

ఆల్ ఇండియా శ్రింప్ హ్యాచరీల అసోసియేషన్ తో సమన్వయం చేసుకుంటూ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి ఆయన తన వంతు సహకారాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా, ఎమ్మెల్సీ శ రాజశేఖర్, ఏ ఎస్ ఎస్ హెచ్ ఏ ప్రతినిధులు నరేంద్ర వర్మ కు అభినందనలు తెలియజేశారు. విజయవాడ కేంద్రంగా త్వరలోనే సంఘం యొక్క పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply