AP | పోగొట్టుకున్న బంగారాన్ని బాధితురాలికి అప్పగించిన కృష్ణా జిల్లా పోలీస్

AP | పోగొట్టుకున్న బంగారాన్ని బాధితురాలికి అప్పగించిన కృష్ణా జిల్లా పోలీస్
AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సీసీ కెమెరాల సహాయంతో తక్కువ సమయంలోనే పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది అందజేశారు. బాధితురాలు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను అత్యంత తక్కువ సమయంలోనే మచిలీపట్నం డిఎస్పి క్రైమ్ పార్టీ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఆ వస్తువు స్వాధీనం చేసుకుని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబి చేతుల మీదుగా ఆమెకు అందజేయడం జరిగింది. వివరాల్లోనికి వెళ్తే నర్సాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే మహిళలు తన యొక్క మొక్కుబడి తీర్చుకునేందుకు నరసాపురం నుండి విజయవాడ బయల్దేరింది.ఆ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ లో దిగి విజయవాడ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి పడిపోయింది. అది గమనించిన బాధితురాలు వెంటనే పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే కేసును సీరియస్గా తీసుకుని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించి, పోయిన బంగారు బ్రాస్లెట్లను రికవరీ చేయడం జరిగింది. సుమారు 70 వేల రూపాయలు విలువగల పోయిందనుకున్న బంగారం తిరిగి లభించడంతో బాధితురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, పోలీసు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నియంత్రణలో భాగంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, వేగవంతమైన దర్యాప్తుతో న్యాయం అందించడంలో కృష్ణాజిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
