AP | వక్ఫ్ బోర్డులో పీపీపీ పద్ధతిని తీసుకువస్తే సహించేది లేదు..

AP | వక్ఫ్ బోర్డులో పీపీపీ పద్ధతిని తీసుకువస్తే సహించేది లేదు..

ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ దగ్గర వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో చైర్మన్ అజిజ్ కి, వైసీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, వైసీపీ రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ తో కలిసి అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీల మీద రాష్ట్రంలోనీ కూటమి ప్రభుత్వం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యంలాగా వ్యవహరిస్తోందన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎక్కడుంటే అక్కడ ఆయా నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలు దోచుకోవడానికి సిద్దపడుతున్నారని ఆరోపించారు. అంజుమన్ సైట్ సుమారు 72 ఎకరాలు ఉందనీ, కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ప్రేమ ఉంటే హజ్ హౌస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి దమ్ముంటే.. మైనారిటీలకి స్కూల్ నిర్మించాలని, ఇంకా మైనార్టీ మీద ప్రేమ ఎక్కువైతే.. ఒక ఉర్దూ స్కూల్ నిర్మించాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ పేరుతో ఎవరు పడితే వస్తే దోచేస్తాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దేవుని ఆశీస్సులతో మైనార్టీలకి మేలు చేసే ప్రభుత్వం 2029 లో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారని తెలిపారు. దాతలు అల్లా పేరుతో దేవునికి ఇచ్చిన భూములను ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇతరులకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. పీపీపీ పద్ధతిని వక్ఫ్ బోర్డులో ఆపకపోతే రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరినీ ఏకం చేసి కార్యచరణ రూపొందించి ఉద్యమం చేస్తామని కుటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాజ్ కమిటీ చైర్మన్ గౌసమ్ లాజమ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షైక్ ఆసిఫ్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ మస్తాన్, విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ మైనార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఆలీమ్, పలు జిల్లాల మైనార్టీ విభాగం అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply