అన్నదానం ఎంతో గొప్పది
వినాయక ఉత్సవాల్లో పోలీసుల ఆధ్వర్యంలో అన్నదానం
బిక్కనూర్, ఆంధ్రప్రభ : అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్ పాల్గొని అన్నదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎవరైనా డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలను నిర్వహించాలని, వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ నరేష్, ఎస్‌ఐ అనిల్, పోలీస్ సిబ్బంది, పలు యువజన సంఘాల సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
