ఆంధ్రప్రభ, గూడూరు, తిరుపతి జిల్లా : ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరు పట్టణ ప్రజలకు సరదా తీసుకొస్తుంది. దసరా ప్రారంభానికి ముందు రోజు మహాలయ అమావాస్య రోజున నిర్వహించే ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరుకు అత్యంత ప్రత్యేకం. గత 78 ఏళ్లుగా ఆనవాయితీగా జెండా పండుగను అత్యంత వైభవంగా పట్టణంలో జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జెండా పండుగ సెప్టెంబర్ 21వ తేదీ అదివారం రాత్రి నిర్వహించేందుకు పట్టణం ముస్తాబవుతోంది. గూడూరు పట్టణానికి జెండా పండుగ ప్రత్యేకం గా చెప్పబడేoదుకు కారణం ఏమిటంటే దేశంలో కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతంలో ఆంజనేయస్వామి జెండా పండుగ నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయస్వామి జెండాపండుగ ఒక్కగూడూరు పట్టణంలో వైభవంగా జరుపుతున్నారు.
జెండా పండుగ ఆనవాయితీ
సుమారు 79 ఏళ్ల కిందట గూడూరు పట్టణంలోని ప్రజలు ప్రతి ఏటా వర్షాకాల సమయంలో కలరా, మశూచి తదితర అంటువ్యాధులతో మరణాలు చోటుచేసుకున్నాయి.అంటురోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేందుకు పట్టణంలోని పలువురు పెద్దలు జెండా పండుగ ప్రారంభించారు. అప్పటినుండి ఈ క్రమంలో మరణించే వారి సంఖ్య తగ్గిపోయింది దీంతో ఈ జెండా పండుగ ఆనవాయితీగా మారింది.
పట్టణానికి చెందిన పలువురు పెద్దలు మైసూర్ లోని దసరా ఉత్సవాలు తిలకించేందుకు వెళ్లారు అక్కడ ఆంజనేయస్వామి జెండా పండుగ నిర్వహించడం వారిని ఆకర్షించింది.జెండా పండుగ విశిష్టత ఆ ప్రాంత ప్రజల నుండి తెలుసుకున్న గూడూరు పెద్దలు గూడూరు పట్టణంలో జెండా పండుగ నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో 1945లో మొదటిగా పట్టణ నడిబొడ్డులో ఉన్న బజారు విధి నందు జండా పండుగను నిర్వహించారు.అందుకు కేటాయించిన స్థలాన్ని కలిశo కొట్టు గా పిలవబడుతుంది.
ఆంజనేయస్వామి జెండా నమూనా..
ఆరుగజాల తెల్లని వస్త్రం తీసుకొని ఆ వస్త్రంపై బొగ్గుతో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతంతో భూమిపై కాలు పెట్టిన భంగిమలో చిత్రీకరించి ఒక పొడవాటి వెదురు కర్రకు ఈ గుడ్డ కట్టి కర్ర జెండాగా పిలవబడే జెండాను తప్పెట్లు తాళాలతో గూడూరు పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించి కలిశo కొట్టు వద్ద ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కలిశo కొట్టు లో నిర్వహించారు.ఈ క్రమంలో పట్టణంలోని పలు వీధుల్లో ఆయా దేవాలయాల వద్ద ఆంజనేయ స్వామి జెండాను ఆవిష్కరించడం మొదలైంది.
ఇదీ ఇతిహాస కథ
రాముడు రావణాసుడు రావణాసురుడు ల మధ్య జరిగిన జరిగిన యుద్ధంలో లక్ష్మణ స్వామి స్పృహ కోల్పోవడంతో అతనిని బతికించేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాలలోని సంజీవిని పర్వతంతో సహా పెకలించి యుద్ధభూమికి వద్దకు తీసుకురాగానే అందులోని సంజీవిని ద్వారా లక్ష్మణ స్వామి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకున్న ట్లు రామాయణం ద్వారా తెలుస్తోంది.
అదేవిధంగా అంటురోగాల బారిన పడి మరణిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఆంజనేయ స్వామి సంజీవిని ద్వారా ప్రాణాలను నిలబెడతారని నమ్మకంతో పట్టణంలో జెండా పండుగ జరపడం ప్రారంభమైంది,ఈ నమ్మకం ఆనవాయితీగా మారి తరతరాలుగా పట్టణ ప్రజలు జెండా పండుగ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
జెండాలో వచ్చిన మార్పులు
జెండా పండుగ తొలినాళ్లలో కర్ర జెండాలను గ్రామోత్సవం చేయడం ప్రారంభమైంది అయితే కాలానికనుగుణంగా ఆంజనేయ స్వామి జండా రూపురేఖలు మారాయి.కేవలం తెల్ల గుడ్డ పై బొగ్గుతో ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించి కర్ర జెండాల రూపేనా గ్రామోత్సవం బదులు రంగురంగుల పెయింట్స్ వినియోగించి ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి చిత్రాలను రూపొందించడం మొదలైంది.
సాంప్రదాయబద్ధంగా తప్పట్లు , మేళతాళాలతో పాటు తెనాలి బ్యాండ్ , తీన్మార్ బ్యాండ్ , డీజే లు కూడా చోటుచేసుకున్నాయి.సాంప్రదాయ నృత్యాలు అయిన కోలాటం, చక్క భజన , యానాది వేషాలు ,కీలు గుర్రాలు తదితరాలు జెండా పండుగ ఉత్సవాల్లో కనిపిస్తాయి . వీటితోపాటు బేతాళ కృత్యాలు , మహంకాళి నృత్యాలు మజిలీ వేషాలు కొత్తగా చోటుచేసుకున్నాయి . వీటితోపాటు కేరళ వాయిద్యాలతో ప్రత్యేక నృత్యాలు అదనంగా చేకూరాయి.
పోటాపోటీగా గ్రామోత్సవాలు
జెండా పండుగ నాడు పోటాపోటీగా ఆంజనేయస్వామి గ్రామోత్సవాలు జరుగుతాయి .పట్టణ పరిధిలోని పలు వీధులలో సుమారు 60 వరకు ఆంజనేయ స్వామి జండాలు ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పట్టణ సమీపంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి జండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
జెండా పండుగ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు కూడళ్ల వద్ద నిర్వాహకులు భారీ సెట్టింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీపడుతున్నారు.
ఈసారి ఆంక్షలు ఎన్నో
గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు,గూడూరు జరుగుతున్న కొన్ని సంఘటనల దృష్ట్యా త్వరలో వినాయక చవితి జెండా పండుగలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంతో పండుగలు ఇవి వీటిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు కఠినమైన ఆంక్షలు విధించడంతో వినాయక చవితి సైతం సో శోగా జరిగిపోయింది.కాగా జెండా పండుగ అనేది గూడూరులో ముఖ్యమైన పండుగ ఈ జెండా పండుగను తిలకించేందుకు దేశ విదేశాల నుండి ప్రజలు తరలివస్తుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం జరగనున్న జెండా పండుగలో అతి ముఖ్యమైన డీజీలు వంటి వాటికి అనుమతులు పోలీసు అధికారులు నిరాకరించడంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు గాని యువకులు ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటికి కొందరు జెండా పండుగ రోజు నాటికి డీజేలో వంటి వాటికి అనుమతులు ఇస్తారని నమ్మకంతో ఉన్నారు. సారీ జెండా పండుగ లేదా ఎన్నడూ లాగని అంగరంగ వైభవంగా అప్పట్లో తాళాలు డీజేలు వంటి వాటి నడుమ యువత కేరింతలతో జరగనుందో వేచి చూడాల్సిందే….!

