Anil Ravipudi | దాని కంటే.. మెగాస్టార్ వంద రెట్లు అదరగొట్టారు..

Anil Ravipudi | దాని కంటే.. మెగాస్టార్ వంద రెట్లు అదరగొట్టారు..

Anil Ravipudi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొంవదిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటించారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు (Movie Promotion) ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Anil Ravipudi

Anil Ravipudi | అది మాత్రం గ్యారెంటీ..

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంటు. ప్రతి సినిమా రిలీజ్ కి ఇక్కడికి వస్తాను. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను. ఆయన దయవలన కెరీర్ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి తిరుపతిలోనే ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) నేను ఎలా చూపించాలి అనుకుంటున్నానో, ఆయన నాకు ఎలా ఇష్టమో, ఆయనలో నాకు ఏం నచ్చుతాయి అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. దానికి తగ్గ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్ లో చూసింది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత ఒక టైం మిషన్ ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తారు. అది మాత్రం గ్యారెంటీ.మెగాస్టార్ లీడర్ రాజు, ఆటో జానీ.. ఇలాంటి క్యారెక్టర్స్ లో ఆయన మనకు విపరీతంగా నచ్చుతారు. నేను ఆ అలాంటి బేసిస్ లోనే ఈ శంకర వరప్రసాద్ క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. ఆయలో ఉన్న ఫన్ టైమింగ్ నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం. నేను రాసిన దాని కంటే చిరంజీవి గారు దాన్ని వందరెట్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రజెంట్ చేశారు.

Anil Ravipudi

Anil Ravipudi | అది స్పెషల్ ఫిల్మ్..

ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీసాల పిల్ల 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇంకా అద్భుతంగా వెళుతుంది. అలాగే శశిరేఖ సాంగ్, వెంకటేష్ (Venkatesh) గారితో చిత్రీకరించిన పాట అన్ని పాటలు కూడా మాస్ కి యూత్ కి ఫ్యామిలీ కి అందరికి నచ్చుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం నా కెరీర్ లో స్పెషల్ ఫిలిం. ఆ సినిమాని మీరందరూ థియేటర్స్ లో అద్భుతంగా సెలబ్రేట్ చేశారు. ఇది నా నాలుగో సంక్రాంతి సినిమా. తప్పకుండా మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. చరణ్ కూడా ట్రైలర్ చూశారు. ఎక్స్ ట్రార్డినరీ ఉందని చెప్పారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషంతో బయటికి వస్తారు. చిరంజీవి (Chiranjeevi) అభిమానులు.. కళ్యాణ్ బాబు అభిమానులు.. చరణ్ అభిమానులు.. అందరూ స్టార్ ఫ్యాన్స్.. ఎక్కడో ఒక చోట చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. మెగాస్టార్ సెలబ్రేట్ చేసుకోండి. వెంకటేష్, చిరంజీవి ఫ్రెండ్స్ లా కలిసిపోయి పని చేశారు. ఆ ఇద్దరు స్టార్స్ ని ఒకే ఫ్రేంలో చూడటం పండగలా వుంటుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మెగా రైడ్ ఉండబోతుంది. నయనతార ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. జనవరి 12 మళ్లీ నవ్వుకుందాం.. మళ్ళీ ఎంజాయ్ చేద్దాం.. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు.

Anil Ravipudi

Anil Ravipudi | మెగాస్టార్ మ్యాజిక్..

నిర్మాత సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. సంక్రాంతికి ట్రీట్ ఎలా ఉండబోతుందో ట్రైలర్ (Trailer) చూస్తే అర్ధమౌతుంది. సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనే ఎక్సైట్మెంట్ ఉంది. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్. ఆయన స్టైల్ మా డైరెక్టర్ అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేశారు. దాన్ని ఎలివేట్ చేయడానికి విక్టరీ వెంకటేష్, నయనతార అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.

Anil Ravipudi

CLICK HERE TO READ ఒకటి కాదు.. రెండు అంటున్న స్టార్స్..

CLICK HERE TO READ MORE

Leave a Reply