Anakapalli | పరీక్ష రాయడానికి వెళుతుంటే…
అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడి టెట్ విద్యార్థిని మృతి చెందింది. ఈరోజు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న టెట్ పరీక్షకు 9 గంటలకు హాజరు కావలసి ఉండగా NAD జంక్షన్ కు చెందిన బి సునీత, తండ్రి ఆటోలో తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరింది. ఆటో అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో నుండి రోడ్డు పై జారిపడ్డ సునీత పై నుండి ఆటో వెళ్లడంతో అక్కడికక్కడే టెట్ విద్యార్థిని సునీత మృతి చెందింది.

కన్న కూతురు తండ్రి కళ్ళముందే చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందర్నీ కలచివేసింది. ఆటోని నడుపుతున్న తండ్రి లక్ష్మణరావు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కూతురు మృతుదేహాన్ని వేరే వాహనంలో తండ్రి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై బంధువులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

