- మూసుకున్నదుర్గమ్మ ఆలయ తలుపులు
- చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా
- రేపటి ఉదయం సేవలు రద్దు
- ప్రత్యేక పూజలు అనంతరం సోమవారం ఉదయం 8 :30 గంటల నుండి అమ్మవారి దర్శనం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై ఉన్నశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ ఆలయాన్నికవాట బంధనంతో మూసివేశారు.
ఈనెల 7 ఆదివారం సాయంత్రం నుండి ప్రారంభమవుతున్న చంద్రగ్రహనాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి(Indrakiladri)పై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి వీకే శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ సామాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ అర్చక బృందం సమక్షంలో ప్రధాన ఆలయ తలుపులను ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేశారు.ప్రధాన దేవాలయంతో పాటు కొండపై ఉన్న ఉప ఆలయాల(Temples)న్నింటినీ చంద్రగ్రహనాన్ని పురస్కరించుకుని కవాట బంధనం తో మూసి వేశారు.
సోమవారం పునఃప్రారంభం..
సంపూర్ణ చంద్రగ్రహణాన్నిపురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ఆలయ తలుపులను ఈనెల 8 సోమవారం ఉదయం తెరవనున్నారు. తెల్లవారుజామున(early morning) 3:00 గంటల నుండి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు(programs) నిర్వహించనున్నారు.
సోమవారం తెల్లవారు జామున జరుగే సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, వస్త్ర సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉదయం 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనాన్నిభాగ్యాన్ని సోమవారం ఉదయం 8:30 గంటల నుండి ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు.

