HYD | భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా..

చార్మినార్‌ సమీపంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు
కిషన్‌రెడ్డితో కలిసి అమ్మవారి సన్నిధికి కేంద్ర హోంమంత్రి


HYD | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా చార్మినార్‌ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అనంతరం అమిత్‌ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు పూజా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్‌ షా, కిషన్‌రెడ్డికి ఆలయ పూజారులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. నగర పర్యటనలో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.