నేడు హైదరాబాద్‌కు అమిత్ షా..!
నేడు హైదరాబాద్‌కు అమిత్ షా..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా తూప్రాన్‌కు వెళ్లనున్నారు.
అక్కడ పాల కేంద్రం ప్రాజెక్ట్‌ని ప్రారంభించనున్నారు. అనంతరం తూప్రాన్ నుంచి కరీంనగర్‌కు చేరుకొని.. ప్రతిమ మెడికల్ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేసి.. విద్యార్థులతో ముఖాముఖి కానున్నారు. సాయంత్రం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
