• బెజవాడలో సంచలనం


ఆంధ్రప్రభ, విజయవాడ : ప్రభుత్వానికి కనపడదు. వినపడదు. కానీ తాను లేస్తే మనిషిని కాదు.. అని మొరుగుతుంది, అని సర్కారీ దొంగలకు బాగా తెలుసు. అందుకే బెజవాడ (Vijayawada) లో ఓ అంబులెన్సును కొట్టేశారు. ఇక ముక్కలు ముక్కలు చేసి తుక్కు తుక్కుగా అమ్మేసుకోవటానికి ప్లాన్ చేశారు. రాత్రికి రాత్రే స్క్రాప్ గ్యాంగ్ తో బేరం కుదిరింది. బందరు రోడ్డులోని చందన గ్రాండ్ దక్కర అంబులెన్సును నిలిపారు. ఇంతలో ఓ క్రేన్ వచ్చింది. అంబులెన్సును తరలించింది. అసలేం జరిగిందంటే.. గంపలగూడెం (Gampalagudem) ప్రభుత్వ ఆసుపత్రికి అప్పటి ఎమ్మెల్యే నిధులతో ఈ వాహనాన్ని ప్రభుత్వానికి అందజేశారు.

కాలం చెల్లే స్థితిలో విజయవాడ మలేరియా విభాగంలో దోమల ఫాగింగ్ కోసం ఈ వాహనాన్ని తరలించారు. ఇంతలోనే మూతపడింది. స్వల్ప రిపేర్లు తప్పటం లేదు. దీని మరమత్తులకు పాపం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మలేరియా విభాగంలో జ్వరంతో ఈ వాహనాన్ని మూలుగుతోంది. మలేరియా (Malaria) విభాగంలో పనిచేసే సిబ్బంది జాలితో తల్లడిల్లిపోయారు. కాటా కి వేస్తే.. కొన్నాళ్లు తాగటానికి మంచినీళ్ల (బ్రాందీ..విస్కీ )కి లోటు ఉండదని ఆశించారు. స్క్రాప్ గ్యాంగ్ కి కాటా వేసేశారు. ఈ విషయం వెలుగు చూడటంతో సోమవారం ఉదయం నుంచి ఆంబులెన్సు (Ambulance) ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బందరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక ఈ అంబులెన్సు దీనంగా.. బితుకు బితుకుమంటూ కనిపించింది. అంతే ఆ అంబులెన్సు ప్రాణం దక్కింది.

Leave a Reply