అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని అన్నారు…రూ.49 వేల విలువైన రాజధాని నిర్మాణాలు శంకుస్థాపన అనంతరం ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. రాజధాని కోసం వేలాది ఏకరాలు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనదని అన్నారు. అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు ఉందన్నారు.. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ ను చూడబోతున్నామని మోదీ పేర్కొన్నారు. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని అంటూ బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇదని ప్రశంసించారు.
ఇప్పుడు తాను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నారనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్నారు. రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ఎపిలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు ప్రధాని.
చంద్రబాబుని చూసి నేర్చుకున్నా..
నేను గుజరాత్ సీఎంగా ఉండగా, నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. టెక్నాలజీ, ఐటీ విషయంలో నాడు చంద్రబాబు రు చూపించిన చొరవ దగ్గరుండి తెలుసుకునే వాడిని. అప్పుడు తెలుసుకున్న విషయాలు ఈ రోజు మీ ముందు నేను చేయగలుగుతున్నాను అని మోడీ ప్రస్తావించారు. నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించి వారు లేరని ప్రశంసించారు మోదీ..