గురువు లింగారెడ్డికి పూర్వ విద్యార్థుల ఘన నివాళి
- మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించిన పూర్వ విద్యార్థులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన లింగారెడ్డి మృతి పట్ల పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం పాఠశాలలో మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు, పూర్వ విద్యార్థి నరసింహ మాట్లాడుతూ పాఠశాల ప్రగతితో పాటు విద్యార్థుల వికాసానికి లింగారెడ్డి నిరంతరం కృషి చేసిన గొప్ప గురువు అని కొనియాడారు. విద్యార్థులు సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు ఆయన అందించిన స్ఫూర్తి ఎంతో దోహదపడిందన్నారు. ఆయన సేవలను పూర్వ విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు మురళీధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్, పూర్వ విద్యార్థులు అశోక్బాబు, తపస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, గణేష్, రాజప్ప, శ్రీనివాస్, భీమ్రాజ్, శివశంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
