మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ లోని బృందావన్ గార్డెన్ లో సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న
పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు మహా సమ్మేళనానికి నారాయణపేటజిల్లా ఊట్కూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి తరలివెళ్లారు. పాఠశాల అధ్యక్షులు ఎం. భాస్కర్ ఆధ్వర్యంలో వాహనాల్లో వెళ్లారు.
ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ శిశు మందిర్ పాఠశాలల్లో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. శిశుమందిర్ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని అన్నారు. శిశు మందిర్ పాఠశాలల్లో విద్య క్రమశిక్షణ క్రీడారంగం తో పాటు దేశభక్తి దైవభక్తి పెంపొందించేందుకు కృషిచేస్తూ విద్యార్థులను సన్మార్గంలో నిలిపేందుకు బోధనలు చేపడతారని అన్నారు.
భవిష్యత్తులో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నర్సింగప్ప, వెంకట్ రాములు, వెంకట్ నారాయణ, నరసింహ, భీమ్ రాజు, కృష్ణ, రోషనప్ప, లలితమ్మ, సుధా తదితరులు పాల్గొన్నారు.
