చిన్నారులకు అక్షర జ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అక్షర జ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించాలని బిజ్వార్ సర్పంచ్ కొత్తపల్లి అంజయ్య అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలింతలు కిశోర బాలికలకు పంపిణీ చేసే పౌష్టికాహారంనాణ్యత పాటించాలన్నారు. చిన్నారులకు పూర్వ విద్యతో పాటు శారీరక మానసిక ఎదుగుదలకు దోహదపడే బలవర్తకమైన ఆహారం వడ్డించాలన్నారు. అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం నుండి సరఫరా చేసే పౌష్టికాహారం అందజేయడంతో పాటు విద్యార్థుల బరువుఎత్తు పరిశీలించాలన్నారు. అంగన్వాడీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననిహామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులువెంకటేష్,పత్తి ఆంజనేయులు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply