Allapally | ప్రచారంలో దూకుడు..

Allapally | ప్రచారంలో దూకుడు..

Allapally | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి ప్రచార హస్తం హవా గుండాల పంచాయతీలో జోరుగా సాగుతుంది. మండలంలో సిపి పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, పిఎస్ఆర్ పీవిఆర్, మండల కోఆర్డినేటర్ సారధ్యంలో ప్రచార కార్యక్రమాలు భుజస్కందాల పై వేసుకొని పలు గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. నూతన మేనిఫెస్టో హామీలను సైతం పంచాయతీ ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రచారంలో భాగంగా గుండాల పంచాయతీలో హస్తం హవా బీకోజీదే అన్నచందంగా మారింది. మండల కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటు, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశం కొరకు గ్రంథాలయం ఏర్పాటు, కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కొరకు కృషి చేస్తాను అని చెప్పారు. గుండాల యువత కొరకు క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటుకు కృషి చేయడం, గుండాల మండల కేంద్రంలోనే పోస్టుమార్టం కేంద్రం మంజూరు ఏర్పాటు చేయిస్తానని, గుండాల మండల కేంద్రంలో సోదరి సోదరీమణుల కొరకు బతుకమ్మ ఘాట్, చెరువు మీద మినీ ట్యాంక్ బండ ఏర్పాటు కొరకు కృషి చేస్తాను అన్నారు.

మండల కేంద్రంలో హిందూ, ముస్లిం క్రైస్తవుల స్మశానవాటిక అభివృద్ధికి కృషి, గుండాల్లోని 30 ఏళ్లుగా శిధిలావస్థ స్థితిలో ఉన్న గ్రామపంచాయతీ స్థానంలో నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. మండల కేంద్రంలో ఉన్న వారంతపు సంతను అభివృద్ధి చేయుటం.. మండల కేంద్రంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేయడం, పంచాయతీ పరిధిలోని గ్రామాలకు సిసి, బీటీ రోడ్లు, నిర్మాణంకు కృషి, పంచాయతీ పరిధిలో రైతులు పండించిన పంటలను నిలువ చేసేందుకు మండల కేంద్రంలో ఉన్నగోధుమలను పున ప్రారంభిస్తామన్నారు. వీటితో పాటుగా ప్రజలకు అవసరమయ్యే పనులకు తమ వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్, రెవిన్యూ సమాచార గృహ నిర్వహణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహాయ సహకారాలతో చెప్పిన ప్రతి హామీ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply