All Party Meeting | నేటి సాయంత్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

రక్షణ మంత్రి రాజ్ నాధ్ అధ్యక్షతన మీటింగ్
పవాల్గాం ఉగ్రదాడిపై చర్చ
గుర్తింపు పొందిన అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలు

న్యూ ఢిల్లీ – కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర‌దాడి జ‌రిగిన నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వ‌హించ‌నుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ స‌మావేశానికి అన్ని పార్టీల‌కు ఆహ్వానం పంపారు.. పార్లమెంట్ అనెక్స్‌లో ఈ భేటీ జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడి గురించి చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు.. నేతలకు వివరించనున్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హుటాహుటినా ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనను కుదించుకుని భారత్‌కు వచ్చేశారు. ఈ అఖిల ప‌క్ష స‌మావేశంలో రాహుల్ పాల్గొన‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *