All facilities | ప్రజలారా… కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి
వెలంపల్లి సర్పంచ్ అభ్యర్థి కూర వెంకటరాజిరెడ్డి
All facilities | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కూర వెంకట రాజిరెడ్డి… గ్రామంలో వాడావాడలా తిరుగుతూ జోరుగా ప్రచారం చేపట్టారు. వెలంపల్లి గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను అభ్యర్థించారు. తాను భారీ మెజార్టీతో గెలిస్తే గ్రామంలో అవసరమైన అన్ని వసతులను సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 14న జరిగే ఎన్నికల్లో మొదటి గుర్తు అయిన కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

