Alia Bhatt | ఫోటోలతో అలియా ఎమోషనల్ పోస్ట్.. వైరల్!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: భారీ అంచనాలతో నేడు విడుదలైన రామాయణం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణలభింస్తుంది. అయితే ఈ సందర్బంగా అలియా భట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఆ చిత్రాల్లో రణ్‌బీర్ కపూర్‌తో పాటు వారి కుమార్తె రాహా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది.
‘రామాయణం’ సినిమా కోసం రణ్‌బీర్ ఎంతగా కష్టపడుతున్నారో అలియా తన పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఒకవైపు సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తూనే.. మరోవైపు కుమార్తె రాహాతో ప్రేమగా సమయం గడుపుతున్న రణ్‌బీర్‌ను ఆమె ప్రశంసించారు. భర్తలోని నటుడినే కాకుండా, తండ్రిగా ఆయన చూపిస్తున్న ప్రేమను కూడా అలియా తన మాటల్లో వ్యక్తం చేశారు.
కేవలం రణ్‌బీర్‌ను మాత్రమే కాకుండా, ఈ భారీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న మొత్తం చిత్ర బృందాన్ని అలియా అభినందించారు. ‘రామాయణం’ కథ ఏ ఒక్కరికో పరిమితమైనది కాదని, ప్రతి ఒక్కరికంటే ఎంతో గొప్పదనే భావనను ఆమె తన సందేశంలో ప్రస్తావించారు. భారతీయ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం చేస్తున్న ప్రయత్నానికి ఆమె మద్దతు తెలిపారు.


‘రామాయణం’ స్క్రీనింగ్‌లో అలియా రియాక్షన్
మరోవైపు ముంబైలో నిర్వహించిన ‘రామాయణం’ ప్రత్యేక ప్రీ-రిలీజ్ స్క్రీనింగ్‌కు కూడా అలియా భట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చిత్రానికి సంబంధించిన పలువురు ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు.ఈ స్క్రీనింగ్ సందర్భంగా అలియా సినిమా చూస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

