అర్న‌బ్ తుపాన్‌పై అప్రమత్తం..

జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం
12 మండలాల్లో 199 సహాయ శిబిరాలు..
131 విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణ
చింతూరు, ఆంధ్రప్రభ:
అర్న‌బ్ తుపాన్‌ ప్రభావంపై పోలవరం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్‌ కే. దినేష్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల వరకు జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, గ్రామాలు ప్రభావితం కాలేదని వెల్లడించారు.

రహదారులపై అడ్డంకులు తొలగింపు
తుపాన్‌ ప్రభావంతో 14 చోట్ల చెట్లు పడిన ఘటనలను పరిష్కరించారు. 11 కల్వర్టుల వద్ద సమస్యలను సరిచేశారు. రెండు చోట్ల రహదారులపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
విద్యుత్‌ పనులు వేగవంతం
జిల్లాలో 153 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా, 131 స్తంభాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 22 స్తంభాల వద్ద పనులు కొనసాగుతున్నాయి.

199 సహాయ శిబిరాల ఏర్పాటు
జిల్లాలోని 12 మండలాల్లో 199 సహాయ శిబిరాలను సిద్ధం చేశారు. గర్భిణులు 2,452 మంది, బాలింతలు 2,505 మంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు.
అత్యవసర యంత్రాలు సిద్ధం
చెట్లు తొలగించే బృందాలు, జేసీబీలు, టిప్పర్లు, పవర్‌ సా యంత్రాలను సిద్ధంగా ఉంచారు. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు.