ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజు తేదీలివే !
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు–2027కు సంబంధించిన ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత నిర్ణీత గడువుల్లో రూ.100 నుంచి రూ.2,000 వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
ఆలస్య రుసుముల వివరాలు..
- అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేదు
- నవంబర్ 11 నుంచి 20 వరకు: రూ.100
- నవంబర్ 22 నుంచి 29 వరకు: రూ.500
- డిసెంబర్ 1 నుంచి 7 వరకు: రూ.1,000
- డిసెంబర్ 9 నుంచి 14 వరకు: రూ.2,000
కోర్సులవారీగా పరీక్షల ఫీజు
- ప్రథమ సంవత్సరం జనరల్ రెగ్యులర్: రూ.540
- ప్రథమ సంవత్సరం ఒకేషనల్ రెగ్యులర్: రూ.890
- ద్వితీయ సంవత్సరం జనరల్ ఆర్ట్స్: రూ.540
- ద్వితీయ సంవత్సరం జనరల్ సైన్స్: రూ.890
- ద్వితీయ సంవత్సరం ఒకేషనల్: రూ.890
ఈ ఫీజుల షెడ్యూల్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిలైన అభ్యర్థులు, అర్హులైన ప్రైవేట్ అభ్యర్థులకు వర్తిస్తుంది. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా పరీక్షల ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లింపు చివరి తేదీలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
