ప్యారిస్ ర్యాంప్‌పై ఐశ్వర్య రాయ్ గ్లామర్ ట్రీట్.. – Photo Gallery
- ఐశ్వర్య రాయ్ గ్లామర్ షో..
- బ్లాక్ వెల్వెట్ గౌన్‌లో మిస్ వరల్డ్ మెరుపులు..
- ముత్యాల కేప్, టియారాతో రాయల్ లుక్
ప్యారిస్, ఆంధ్రప్రభ : మిస్ వరల్డ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తన అందం, స్టైల్‌తో అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికను ఆకట్టుకున్నారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో సోమవారం జరిగిన లొరియల్ ప్యారిస్ ‘లె డెఫిలే 2026’ షోలో ర్యాంప్‌పై అడుగుపెట్టిన ఐశ్వర్యను చూసి ఫ్యాషన్ ప్రియుల చూపంతా ఆమెపైనే నిలిచింది. నలుపు రంగు వెల్వెట్ గౌన్‌లో ఆమె ఇచ్చిన గ్లామరస్ పోజులు, ర్యాంప్‌పై నడిచిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఐశ్వర్య ధరించిన బ్లాక్ వెల్వెట్ ఫిష్‌టెయిల్ గౌన్ ఆమె రూపానికి మరింత హుందాతనాన్ని తీసుకొచ్చింది. వి-షేప్ నెక్‌లైన్‌తో ఉన్న ఈ గౌన్ ఆమెను మరింత హైలైట్ చేసింది. దానికి ముత్యాలతో అలంకరించిన స్టేట్‌మెంట్ కేప్‌ను జోడించడంతో ఆమె లుక్‌కు రాయల్ టచ్ వచ్చింది. నలుపు రంగు గౌన్‌పై మెరిసే ముత్యాల కేప్.. ర్యాంప్ లైట్ల మధ్య ఐశ్వర్యను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.
అంతేకాదు.. ఐశ్వర్య తలపై ధరించిన టియారా ఆమె లుక్‌లో మరో ప్రత్యేకతగా నిలిచింది. టియారాతో ఆమె ర్యాంప్‌పై ఏకంగా రాణిలా కనిపించారు. ఎరుపు రంగు బోల్డ్ లిప్స్, షార్ప్‌గా కనిపించే వింగ్డ్ ఐలైనర్, మెరిసే డ్యూయీ మేకప్‌తో ముఖానికి మరింత గ్లో తీసుకొచ్చారు. సహజమైన అందాన్ని కప్పిపుచ్చకుండా, మేకప్‌ను స్టైలిష్‌గా ఉపయోగించడంతో ఐశ్వర్య లుక్ క్లాసీగా, గ్లామరస్‌గా కనిపించింది.
సిరియన్ డిజైనర్ లేబుల్ యారా షూమేకర్ రూపొందించిన ఈ గౌన్‌లో ఐశ్వర్య ర్యాంప్‌పై నడుస్తూ కెమెరాలకు పోజులిచ్చారు. ఆమె నడక, కాన్ఫిడెన్స్, ముఖంలో కనిపించిన చిరునవ్వు ఫ్యాషన్ షోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. బ్లాక్ అండ్ పెర్ల్ కాంబినేషన్, బోల్డ్ రెడ్ లిప్స్ కలసి ఆమెకు ఒకవైపు హై-ఫ్యాషన్ రాయల్ లుక్‌ను అందించాయి.
లొరియల్ ప్యారిస్ గ్లోబల్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న ఐశ్వర్య.. ఈ బ్రాండ్ నిర్వహించిన షోలో మరోసారి తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను చాటుకున్నారు. ఐఫిల్ టవర్, ఎకోల్ మిలిటైర్ సమీపంలోని ప్లేస్ జోఫ్రేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆండీ మెక్‌డోవెల్, ఇవా లాంగోరియా తదితర గ్లోబల్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
లొరియల్ ప్యారిస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐశ్వర్య ఫొటోలను కూడా పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె బ్లాక్ గౌన్, ముత్యాల కేప్, టియారాతో కనిపించగా.. అభిమానులు ఆమె లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్’ అనే సందేశంతో బ్రాండ్ ఈ ఫొటోలను షేర్ చేసింది.
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ఐశ్వర్యకు ఇది కొత్తేమీ కాదు. రెండు దశాబ్దాలకు పైగా లొరియల్ ప్యారిస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రపంచస్థాయి ఈవెంట్లలో తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో తొలిసారి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై నడిచిన ఆమె.. ఇప్పుడు మరోసారి అదే వేదికపై తనదైన స్టైల్‌తో మెరిశారు.
ఈసారి లొరియల్ ప్యారిస్ షోలో ‘బ్రిడ్జర్టన్’ నటి సిమోన్ యాష్లీ, ఇవా లాంగోరియా, గాయని సెలిన్ డియోన్, మోడల్ కారా డెలివింగ్నే, నటి క్రిస్టెన్ బెల్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు కూడా ర్యాంప్‌పై సందడి చేశారు. అయితే బ్లాక్ వెల్వెట్ గౌన్, ముత్యాల కేప్‌తో ఐశ్వర్య రాయ్ కనిపించిన రాయల్ గ్లామర్ లుక్ మాత్రం షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.







