Airlines | విమానానికి బాంబు బెదిరింపు

Airlines | విమానానికి బాంబు బెదిరింపు
Airlines | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేఎల్ఎం ఎయిర్‌లైన్స్ (Airlines) విమానానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి (Airport) ఈ మేరకు ఒక ఈమెయిల్ అందిందని పేర్కొన్నారు. అయితే, విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అనంతరం భద్రతా సిబ్బంది పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
