న్యూ ఢిల్లీ – టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India ) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు (Safty checking ) చేపడుతోంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన ఇబ్బందులతో జాతీయ, అంతర్జాతీయంగా (nationa, International ) నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా పలు సర్వీసులను సంస్థ రద్దు చేసింది.
జాతీయ, అంతర్జాతీయంగా నడిచే..
నిర్వహణ, కార్యాచరణ కారణాల వల్ల నేడు జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. రద్దైన విమానాల్లో దుబాయ్ నుంచి చెన్నైకి రావాల్సిన AI906 విమానం, ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్లాల్సిన AI308 విమానం, మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI309 విమానం, దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన AI2204 విమానం, పూణె నుంచి ఢిల్లీకి రావాల్సిన AI874 విమానం, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI456 విమానం, హైదరాబాద్ టు ముంబైకి వెళ్లాల్సిన AI-2872 విమానం, చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన AI571 విమానాలు ఉన్నాయి.