80 అడుగుల రోడ్డులో 5కె రెడ్ రన్
- యువతలో ఎయిడ్స్ పై అవగాహన కోసమే 5కె రన్
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇఎన్వీ నరేష్ కుమార్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : యువతలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి 5కె రన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈఎన్వి నరేష్ కుమార్ వెల్లడించారు. 80 అడుగుల రోడ్డులో గల వాంబే కాలనీ నుండి మిల్ జంక్షన్ వరకు 5కె రన్ ను అదనపు డిఎంహెచ్ఓ తాడేల శ్రీకాంత్ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిడ్స్ పై యువతలో అవగాహన కల్పించడానికే రెడ్ రన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఇందులో 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ యువకులు అందరూ కూడా పాల్గొన్నారన్నారు.
వీరిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 10,000 రూపాయిలు,, సెకండ్ వచ్చిన వారికి 7,000 ప్రైజ్ మనీ. ఇస్తామన్నారు పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈ రన్ నిర్వహించామన్నారు. రన్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశము ఎయిడ్స్ మీద ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలని తెలిపారు . ప్రతి ఒక్కరు పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. అందులో పాజిటివ్ వచ్చిన వాళ్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని, మందులు కూడా ఉచితంగా పొందాలన్నారు.
అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్లు కూడా మధ్యలో ఆపేయకుండా ఆ ట్రీట్మెంట్ని కొనసాగించాలని చెప్పారు. వైరల్ లోడ్ అనేది తగ్గాలన్నారు. అనంతరం ఎయిడ్స్ పై అవగాహన పాంప్లేట్ ను ప్రదర్శించారు.
నిర్వహించిన 5కె రన్ లో మహిళా విభాగంలో ప్రధమ బహుమతి జగదీశ్వరి, ద్వితీయ బహుమతి చెరుకుపల్లి మధు, తృతీయ బహుమతి తేజేశ్వరి పొందగా పురుషుల విభాగంలో ప్రధమ బహుమతి సతీష్ కుమార్, ద్వితీయ బహుమతి శ్యాంసుందర్, వి. మహేష్ తృతీయ బహుమతులు పొందారు. అనంతరం చెక్కులు, సర్టిఫికేట్లు అందజేశారు. విశ్రాంత వైద్యులు అప్పలనాయుడు, సిపిఎం శైలజ, మోహిని, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
