రూ.20 వేల లంచం తీసుకుంటూ..
- ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి!
- సదాశివపేట మండల వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఏఓ రమేష్
- లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు కార్యాలయంలో మెరుపు దాడి నిర్వహించి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో కలకలం రేగింది.
అయితే, ఏ పనికి సంబంధించి ఆయన లంచం డిమాండ్ చేశారు? ఎవరి నుంచి నగదు తీసుకున్నారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏసీబీ విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది.
