అగ్గిపెట్టి మచ్చకు అస్వస్థత.. పరిస్థితి విషమం
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్నఅగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత విషమించినట్లు తెలుస్తోంది.
దీంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 5న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ప్రస్తుతం కిరణ్‌కు డాక్టర్లు వెంటిలేటర్‌పైఐ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు రాకేశ్ మాస్టర్, స్వాతినాయకుడు టీంతో కలసి హంగామా సృష్టించేవారు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రజలు, అభిమానులను నవ్వించేవారు.
